సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడంలేదో సమాధానం చెప్పండి జగన్ గారు: దేవినేని ఉమ

  • గ్యాస్‌ లీక్‌పై స్పందించాలి
  • 12 మంది చనిపోయారు
  • వేలాది మంది నిరాశ్రయులయ్యారు
  • ఎల్జీ కంపెనీలో అలారం మోగదు
విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో గ్యాస్ లీక్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఇప్పటివరకు కేసులు ఎందుకు పెట్టలేదని నిలదీశారు.

'12 మంది చనిపోయి వేలాది మంది నిరాశ్రయులైతే పర్యావరణ ఉల్లంఘన, విధ్వంసం, రాజ్యాంగ ఉల్లంఘన, వాటర్, ఎయిర్ యాక్ట్  సెక్షన్ల కింద కేసులు లేవు. మీరు చెప్పే పేరున్న మంచి ఎల్జీ కంపెనీలో అలారం మోగదు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడంలేదో ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.


Devineni Uma
Telugudesam
Jagan
YSRCP

More Telugu News